రాహుల్ గొప్ప ఎంటర్టైనర్ – బ్రియాన్ లారా

Wednesday, March 11th, 2020, 01:28:39 AM IST

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా టీం ఇండియా బ్యాట్సమెన్ రాహుల్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం తనకిష్టమైన క్రికెటర్ ఎవరని అడిగిన ప్రశ్నకి బ్రియాన్ లారా ఇచ్చిన సమాధానం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అయితే తాను ప్రత్యేకంగా రాహుల్ అభిమానిని అని తెలిపారు. రాహుల్ ఒక గొప్ప ఎంటర్టైనర్, గొప్ప నైపుణ్యం గల ఆటగాడు అని ప్రశంసలు కురిపించారు. అతని బ్యాటింగ్ చూడటానికి నేను ఎక్కువగా ఇష్టపడతా అని తెలిపారు. అయితే అతనొక క్లాస్ ప్లేయర్ అని బ్రియాన్ లారా అన్నారు.

అయితే టెస్టుల్లో విధ్వంసకర బ్యాట్సమెన్ గా పేరొందిన బ్రియాన్ లారా టెస్టుల్లో అత్యధికంగా 400 పరుగులు సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే టీం ఇండియా బ్యాట్సమెన్ రోహిత్, కోహ్లీ లని పక్కన పెట్టేసి కేఎల్ రాహుల్ ఫేవరెట్ అనడంతో కేఎల్ రాహుల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.