ఈ ఏడాది ఐపీఎల్ ఉందా లేదా?బీసీసీఐ చెప్పింది ఇదే.!

Wednesday, April 15th, 2020, 04:53:06 PM IST


మన దేశంలో అత్యధికంగా ఇష్టపడే ఏకైక క్రీడ ఏదన్నా ఉంది అంటే అది క్రికెట్. ఏ ఫార్మాట్ అయినా సరే మనవాళ్ళు ఎగబడి చూస్తుంటారు. అలాంటి సమయంలో ఐపీఎల్ అనేది ఒకటి ఒకటి క్రికెట్ అభిమానుల్లోనే ఒక చెరగని ముద్ర వేసుకుంది. దగ్గరకు దశాబ్ద కాలం నుంచి కొనసాగుతున్న ఈ రసవత్తర సీజన్ కోసం ఎప్పటి లానే ఈ ఏడాది కూడా ఎదురు చూస్తున్నారు.

కానీ గడిచిన కొన్ని రోజుల్లోనే దేశమంతా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో ఈసారి ఐపీఎల్ సీజన్ ను లాక్ డౌన్ వరకు వాయిదా వేశారు కానీ రద్దు చెయ్యలేదు. ఈ విషయాన్నే బీసీసీఐ వారు మొదట తెలిపారు. కానీ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈసారి ఐపీఎల్ ను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వారు తెలిపారు.