వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ..!

Friday, May 7th, 2021, 10:30:54 PM IST

సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మొత్తం 18 మంది ప్రాబబుల్స్‌తో కూడిన భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది. జూన్‌ 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జ‌ట్టులో హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, పృథ్వీ షా, భువనేశ్వర్‌ కుమార్‌కు చోటు దక్కలేదు. తెలుగు కుర్రాడు హనుమ విహారికి జట్టులో చోటు దక్కింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముగిసిన తర్వాత భార‌త్-ఇంగ్లండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు దాదాపు ఇదే జట్టు కొనసాగే అవకాశముంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ సిరీస్‌ జరగనుంది.

జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానే (వైఎస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, విహారి, రిషబ్‌ పంత్(వికెట్‌ కీపర్‌)‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా, షమీ, సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌‌, ఉమేష్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ