బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు..!

Friday, June 19th, 2020, 01:16:33 AM IST


ఏపీకి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీలో డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే 2017లో శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సిరీస్ గెలవడంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన శిక్షణ పూర్తి చేసుకోవటంతో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ, వచ్చే ఒలంపిక్స్ క్రీడలకు శిక్షణ పొందేందుకుకై ఆయనకు ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.