పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆరోన్ ఫించ్, వార్నర్ మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా చక్కగా రాణించడంతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ (114 పరుగులు), డేవిడ్ వార్నర్ (69 పరుగులు), స్టీవ్ స్మిత్(101 పరుగులు), గ్లెన్ మాక్స్వెల్(45 పరుగులు) చేశారు. భారత బౌలర్లలో షమి 3 వికెట్లు తీయగా, బుమ్రా, సైని, చాహల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. మయాంక్ అగర్వాల్ (22 పరుగులు), విరాట్ కోహ్లీ (21 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (2 పరుగులు), కేఎల్ రాహుల్ (12 పరుగులు) మాత్రమే చేయడంతో 101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా 90 పరుగులు, ధావన్ 74 పరుగులతో రాణించి భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. చివరికి వీరిద్దరూ కూడా ఔటవ్వడంతో భారత్ గెలుపుపై ఆశలు వదులుకుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులకే పరిమితం కావడంతో 66 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది.