లంచ్ బ్రేక్ కి ఆసీస్ 149/4… ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన సిరాజ్

Monday, January 18th, 2021, 08:24:10 AM IST

ఆస్ట్రేలియా తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా వరుస వికెట్ లను తీస్తోంది. అయితే 21/0 స్కోర్ తో నాల్గవ రోజు బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్లు మంచి స్కోర్ నే సాధించారు. వార్నర్ 48 పరుగులు చేయగా, హారిస్ 38 పరుగులు చేశారు. అయితే భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ వరుస వికెట్ లను కోల్పోయింది. 31 వ ఓవర్ లో సిరాజ్ రెండు వికెట్లను తీశాడు. లబుషేన్ ను 25 పరుగుల వద్ద, వేడ్ ను డకౌట్ గా పెవిలియన్ కి చేర్చాడు.

అయితే కీలక వికెట్ లను కోల్పోవడం తో రెండవ ఇన్నింగ్స్ ను ఆసీస్ ప్రస్తుతం నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ కి 149 పరుగులకు 4 వికెట్ లను కోల్పోయింది. ప్రస్తుతం స్మిత్ 28 పరుగులు, గ్రీన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ ప్రస్తుతం 182 పరుగుల ఆధిక్యం లో ఉంది. ఈ మ్యాచ్ ఎవరు విజయం సాధిస్తే సీరీస్ కూడా వారికే సొంతం కానుంది.