టీ20 లకు గుడ్ బై చెప్పనున్న డేవిడ్ వార్నర్…కారణం అదేనట!

Wednesday, February 12th, 2020, 11:18:08 AM IST

ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డు అందుకున్న డేవిడ్ వార్నర్ టీ20 రిటైర్మెంట్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. 2020, 2021 టీ 20 వరల్డ్ కప్ ల తర్వాత టీ20 లకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తీరికలేని షెడ్యూలు తో ఆడుతూ ఉండటం వలన కష్టంగా ఉందని తెలిపారు. అన్ని ఫార్మాట్ల లో క్రికెట్ ఆడిన ఏబీ డివిలియర్స్, సెహ్వాగ్ లని అడగండి, అన్ని ఫార్మాట్లలో ఆడటం సవాల్ తో కూడుకున్న విషయమని చెబుతారు అని అన్నాడు. అయితే అన్ని ఫార్మాట్లలో ఆడాలని అనుకుంటున్న వారికీ గుడ్ లక్ తెలిపారు.

తన కుటుంబంతో ప్రయాణాలు చేయడం చాల ఇబ్బందిగా ఉందని, ఎదో ఒక ఫార్మటు కి వీడ్కోలు పలికితే ఉపశమనం లభిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అయితే తాజాగా బిగ్ బాష్ లీగ్ జరిగిన సంగతి అందరికి తెల్సిందే. అయితే అందులో ఆడకపోవడానికి గల కారణాలు వివరించారు. తదుపరి సిరీస్ లకు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం కావాలనే ఉద్దేశ్యం తో విరామం తీసుకున్నట్లు తెలిపారు.