వార్నర్, హారిస్ ఔట్…ఆస్ట్రేలియా తొలి సెషన్ 65/2

Friday, January 15th, 2021, 08:34:01 AM IST

టీమ్ ఇండియా తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆదిలోనే ఆసీస్ వార్నర్ ను కోల్పోయింది. తొలి సెషన్ లో మొత్తం రెండు వికెట్ లను కోల్పోయింది. లంచ్ బ్రేక్ టైమ్ కి ఆసీస్ 65 పరుగులు చేసి 2 వికెట్ లను కోల్పోయింది. ఈ కీలక మ్యాచ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), మార్కస్ హారిస్ (5) త్వరగా వికెట్ లు కోల్పోయారు. టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ వార్నర్ వికెట్ ను తొలి ఓవర్ లోనే తీయగా, శార్దూల్ టాకూర్ బౌలింగ్ లో హారిస్ ఔట్ అయ్యాడు. అయితే వెళ్ళద్దరూ త్వరగా ఔట్ కావడం తో ఆసీస్ బ్యాట్స్ మన్ ఆచి తూచి ఆడుతున్నారు. స్మిత్ 30 పరుగులు, లబుషేన్ 19 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.