ఐపీఎల్-2020: ఫస్ట్ మ్యాచ్‌కి అదిరేలా ముస్తాబైన అబుదాబీ స్టేడియం..!

Thursday, September 17th, 2020, 03:04:44 PM IST

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు మరో రెండు రోజులలో ఆ ఆశలు తీరబోతున్నాయి. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వనున్న దుబాయ్‌లోని అబుదాబీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. రాత్రి సమయంలో రంగు రంగుల దీపాలతో స్టేడియం మిరమిట్లు గొలుపుతుంది.

అయితే దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ కార్యదర్శి జే షా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మొత్తం మూడు వేదికలలో జరగనున ఈ సీజన్, 60 మ్యాచ్‌లు 53 రోజులతో ఐపీఎల్ అభిమానులను అలరించనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 29 న ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా కారణంగా అది కాస్తా వాయిదాపడింది. అయితే భారత్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో టోర్నీనీ దుబాయ్‌కి షిఫ్ట్ చేశారు.