ఆస్ట్రేలియా క్రికెట్ : డేవిడ్ వార్నర్ కి అరుదైన అవార్డు…

Wednesday, February 12th, 2020, 01:18:12 AM IST

ఆస్ట్రేలియా క్రికెట్ డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తాజాగా మరొక అరుదైన అవార్డుని సొంతం చేసుకున్నారు. కాగా గతంలో బాల్ టాంపరింగ్ కారణంగా గత ఏడాది నుండి నిషేదంలో ఉన్నటువంటి క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాజాగా తన రీ ఎంట్రీ తో అదరగొట్టాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్‌లో సైతం విజృంభించారు డేవిడ్ వార్నర్. ఇకపోతే బెస్ట్ ఆస్ట్రేలియా క్రికెటర్ కోసమని ఒకరకమైన పోలింగ్ నిర్వహించగా, ముందు వరుసలో నిలిచారు వార్నర్. కాగా స్టీవ్ స్మిత్ కన్నా వార్నర్ ఎక్కువగా ఓట్లు తెచ్చుకొని, అలెన్‌ బోర్డర్‌ మెడల్‌ను మూడోసారి దక్కించుకున్నాడు. ఇకపోతే డేవిడ్ వార్నర్ గతంలో కూడా ఈ అవార్డును 2016, 2017లోనూ సొంతం చేసుకున్నారు.

ఇకపోతే కొన్ని అనివార్య కారణాల వలన బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేదంలో ఉన్నటువంటి డేవిడ్ వార్నర్, తాజాగా తన రీ ఎంట్రీతో అందరిని అలరించాడని చెప్పాలి. దేనికి తోడు తన ఆటను ఎప్పటిలాగే కొనసాగిస్తూ, మళ్ళీ తనకు తిరుగులేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.