హాట్ టాపిక్: ఐపియల్ చరిత్రలో ఇదొక భారీ రికార్డ్

Tuesday, September 22nd, 2020, 10:14:14 PM IST

ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపియల్ సీజన్స్ కంటే కూడా ఈసారి జరుగుతున్న ఐపియల్ చాలా ప్రత్యేకమైనది. మునుపెన్నడూ లేని విధంగా ఆడియెన్స్ లేకుండానే ఈ ఐపియల్ జరుగుతూ ఉండటం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, ప్రేక్షకులు ఎవరూ కూడా నిబంధనల ప్రకారం అనుమతి లేదు. అయితే డ్రీమ్ 11 మొదటి సారి స్పాన్సర్ చేయడం మాత్రమే కాకుండా, ఈ టైమ్ లో ఒక భారీ రికార్డ్ ను నెలకొల్పడం జరిగింది.

అత్యధికంగా టీవీ మరియు డిజిటల్ లో ఎక్కువ వీక్షణలు సాధించిన ఐపియల్ గా చరిత్ర కెక్కింది. 200 మిలియన్ వీక్షకులను చేరింది. ఈ విషయాన్ని ఐపియల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఇంకా వీటికి ఆదరణ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మన భారత్ లో కాకుండా, యూ ఏ ఈ లో ఇందుకు సంబంధించిన మ్యాచ్ లు జరుగుతుండటం తో భారత్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డిజిటల్ మరియు టీవీ ల ద్వారా నే చూడటం జరుగుతుంది.