16ఏళ్ళ కల నెరవేరింది

Thursday, October 2nd, 2014, 05:53:09 PM IST


భారత హీకీ జట్టును ఊరిస్తున్న స్వర్ణం కల ఎట్టకేలకు నెరవేరింది. 1998 తరువాత ధనరాజ్ పిళ్ళై ఆద్వర్యంలో భారత హాకీ జట్టు స్వర్ణం గెలుపిందింది. అనంతరం ఇంతవరకు హాకీ జట్టు ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించలేదు. ఇప్పుడు సర్దార్ సింగ్ కెప్తెన్సీలో మళ్ళి భారత్ స్వర్ణ పతాకాన్ని సాధించింది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై ఈ చిరస్మరణీయమైన విజయాన్ని భారత్ సాధించింది. భారత్ పెనాల్టి షూట్ అవుట్ లో 4-2 గోల్స్ తేడాతో పాకిస్తాన్ ను ఓడించి స్వర్ణ పతాకాన్ని సాదిచడమే కాకుండా.. 2016లో రియోలో జరిగే ఒలంపిక్స్ లో ఆడేందుకు అర్హతను కూడా పొందింది.
ఇదిలా ఉంటె… భారత్ 4×400 రిలే లో మహిళలు స్వర్ణ పతాకాన్ని సాధించారు. ఈ రెండు స్వర్ణ పతకాలతో కలిపి భారత్ మొత్తం 10 స్వర్ణ పతకాలు సాధించి పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.