మూవీ రివ్యూ : దొరసాని

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ప్రధాన పాత్రలలో ఒకనాటి తెలంగాణా సమాజంలో దొరస్వామ్య వ్యవస్థలో జరిగిన ప్రేమ కథగా తెరకెక్కిన “దొరసాని” నేడు విడుదలైంది. ఆసక్తికరమైన ట్రైలర్స్, టీజర్స్ తోపాటు మూవీకి విపరీతమైన ప్రచారం కల్పించడంతో ప్రేక్షకులలో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దర్శకుడు కె వి మహేంద్ర పేద ధనిక వర్గాల కు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే ప్రేమ కథగా తెరకెక్కించారు. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎంత వరకు ఆ అంచనాలు అందుకుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

కథ:

ఓ సామాన్య యువకుడైన రాజు తన మిత్రలతో కలిసి తమ పల్లెలో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అలాంటి రాజు దొరల కుటుంబానికి చెందిన అమ్మాయి దేవకీ తో ప్రేమలో పడతాడు. పుట్టినప్పటినుండి అనేక కట్టుబాట్ల మధ్య పెరిగిన దేవకీ రాజుని ప్రేమించడం జరుగుతుంది. దొరల వైపు చూస్తేనే చంపేసే కాలంలో పెద్దింటి అమ్మాయి దేవకీ ని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలిసిన దొరల కుటుంబం రాజుని,అతని కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు. ఇన్ని సమస్యల మధ్య, రాజు దేవకీలు తమ ప్రేమను ఎలా గెలుచుకుంటారు, అనేది మిగతా కథలా అనిపిస్తుంది.

విశ్లేషణ:

దేవకీ రాజుల మధ్య నడిచే ఆహ్లదమైన ప్రేమ సన్నివేశాలు ,అలాగే పల్లెటూరి అమాయక స్వభావం కలిగిన స్నేహితుల మధ్య నడిచే హాస్యసన్నివేశాలు సినిమా మొదటి భాగంలో చక్కగా కుదిరాయి. అలాగే నాటి తెలంగాణా సమాజాన్ని,ప్రజల సంస్కృతిని దర్శకుడు మహేంద్ర చక్కగా ఆవిష్కరించారు. ప్రధాన పాత్రలు చేసిన ఆనంద్,శివాత్మిక ఇద్దరు కొత్తవారైనప్పటికీ, తమ పాత్రలను చక్కగా చేశారు. సాధారణ కుటుంబానికి చెందిన యువకుడిగా ఆనంద్ నటన చాలా సహజంగా ఉంది. అలాగే దొరల కుటంబంలో ఆంక్షలు,కట్టుబాట్ల మధ్య పెరిగిన ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయిగా శివాత్మిక చక్కగా సరిపోయింది. ఇక నక్సలైట్ పాత్రలో కిషోర్ నటన బాగుంది.

ప్రధాన పాత్రలను తెరపై చక్కగా ఆవిష్కరించిన దర్శకుడు కథనం విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది.దీనితో చిత్రం సినిమా నెమ్మదిగా జరుగుతున్న భావన కలుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చిత్రం పర్వాలేదు అన్నట్లుగా ఉంది. మొదటి సగం ప్రధాన పాత్రల మధ్య జరిగే లవ్ రొమాంటిక్ సన్నివేశాలతో నడిపిన దర్శకుడు రెండవ సంగం ప్రేమ కొరకు రాజు,దేవకిల పోరాటం చూపించారు. పోలీస్ స్టేషన్ లో శివాత్మిక ఎమోషనల్ సన్నివేశంలో బాగా నటించింది. ఇక మూవీ కెమెరా వర్క్ బాగుంది. మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి అందించిన సంగీతం ఎస్సెట్ అని చెప్పాలి. ఆయన నేపధ్య సంగీతం కొన్ని సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసింది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

ఆనంద్ దేవరకొండ,శివాత్మిక
క్లైమాక్స్
ఎమోషనల్ సన్నివేశాలు
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

స్టోరీ
స్క్రీన్ ప్లే

తీర్పు:

కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బలమైన నేపథ్యంతో భావేద్వేగమైన ప్రేమ కథతో కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకునప్పటికీ… స్టోరీ కాన్సెప్ట్‌ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం, సినిమాలో కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని కొంతమేరకు దెబ్బ తీశాయి. మొత్తం మీద ఈ సినిమా మంచి ఫ్యూర్ ప్రేమ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు అలరిస్తోందో చూడాలి.

Rating: 2.5/5