మూవీ రివ్యూ : ‘అల్లాద్దీన్‌’

డైరెక్ట‌ర్ ‘గై రిట్‌చ్చి’ దర్శకత్వంలో వస్తోన్న మ్యూజిక‌ల్‌ ఫ్యాంట‌సీ అమెరిక‌న్ చిత్రం ‘అల్లాద్దీన్‌’. ఈ చిత్రంలో విల్ స్మిత్‌, మీన మ‌సూద్న‌, సీమ్‌పెడ్రాడ్‌, న‌మి స్కోట్ త‌దిత‌రులు నటించారు. రేపు రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని ప్రెస్ కోసం ప్రత్యేకంగా షో వేయడం జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఇక కథ విషయానికి వస్తే తల్లిదండ్రులను చిన్నప్పుడే పోగొట్టుకుని పేదరికంలో బతుకుతూ.. అందరీ చేత బేవర్స్ అనిపించుకుంటుంటాడు అలాద్దీన్‌ (మేనే మసూద్‌). ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాలు అంతరం అల్లాద్దీన్ కి యువరాణి జాస్మిన్ (నయోమి స్కాట్‌) పరిచయం అవుతుంది. వారి మధ్య జరిగిన కొని సంఘటనలతో ఇద్దరికీ ఒకరి పై ఒకరికి ఆకర్షణ కలుగుతుంది. అయితే జాస్మిన్ రాజ్యంలోని జాఫర్ అనే క్రూరుడు ఆ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి ద్విపంలో ఉండే జీని కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని సంఘనల తరువాత ఆ ద్విపం అలాద్దీన్ కి దొరుకుంతుంది. దాంతో అలాద్దీన్ ఏం చేసాడు ? చివరికి యువరాణి జాస్మిన్ ఎలా పొందాడు ? ఈ క్రమంలో అతనికి ఎదురైనా సమస్యలు ఏమిటి ? అనేదే మిగతా కథ.

విశ్లేషణ :

ఈ కథని ఎన్ని సార్లు సినిమాగా తీసిన, చూసిన ప్రతి సారి కొత్తగానే ఉంటుంది. కారణం అత్యంత అద్భుతమైన విజువల్స్ అని చెప్పాలి. డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికని వాడుకొని, అల్లాద్దీన్ కథని ఓ విజువల్ వండర్ గా తీర్చి దిద్దారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు అరేబియన్ రాజ్యంలోకి వెళ్లి ఆ లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి కారణం భారీ బడ్జెట్ తో అల్లాద్దీన్ కి జోడించిన సరికొత్త హంగులే . ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ అద్భుతంగా నటించాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్ కూడా చాలా బాగా యాక్ట్ చేసాడు. ప్రిన్స్‌ జాస్మిన్‌ గా నయోమి స్కాట్‌ చాలా బాగా నటిచింది.

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వగా.. అల్లాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు ఎలాంటి కామెడీ కోరుకుంటున్నారో ఈ డబ్బింగ్ సినిమాలో ఆ టైపు కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌ తో మాడ్యులేషన్ తో మరోసారి ఈ సినిమాకే తన టైమింగ్ తో హైలెట్ గా నిలిచారు.

‘అలాద్దీన్‌’ డైరెక్ట‌ర్ ‘గాయ్‌ రిట్చయ్‌’ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. అద్భుతమైన విజువల్స్ తో సినిమాను మ్యూజిక‌ల్‌ ఫ్యాంట‌సీ చిత్రంగా మలిచారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సంబంధించన ప్రతి క్రాఫ్ట్ అద్భుతంగా వుంది. సినిమాలో సాంకేతికంగా పెద్దగా ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్, కంప్యూర్ గ్రాఫిక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం.

ప్లస్ పాయింట్స్ :

అద్భుతమైన విజువల్స్

నటీనటుల నటన

ఎమోషనల్ సన్నివేశాలు

కొన్ని లవ్ సీన్లు

‘గై రిట్‌చ్చి’ దర్శకత్వ పనితనం

మైనస్ పాయింట్స్ :

సెకెండ్ హాఫ్ కథనం

అర్ధం కానీ పాటలు

అక్కడక్కడా స్లోగా నడిచే సీన్స్

తీర్పు :

‘గై రిట్‌చ్చి’ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ మ్యూజిక‌ల్‌ ఫ్యాంట‌సీ చిత్రం అద్భుతమైన స్పెషల్ ఎఫెక్ట్స్ తో మరియు కొన్ని లవ్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే స్లోగా సాగే సీన్స్ తో పాటు అలాగే అర్ధం కాని పాటలతో కొంత ఇబ్బంది పెడుతుంది ఈ చిత్రం. కానీ సినిమాలో కంటెంట్ తో పాటు విజువల్స్ బాగా అలరిస్తాయి. ఓవరాల్ గా ‘అల్లాద్దీన్‌’ ప్రేక్షకులకు ఓ మంచి విజువల్ ట్రీట్ ఇస్తాడు.

Rating : 3.5/5