రోజీ భాభీ.. లుకింగ్ ఆసమ్!

Thursday, May 14th, 2015, 06:42:43 PM IST

anushka-yuvaraj
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మ తాజా చిత్రం ‘బాంబ్వే వెల్వెట్’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా అనుష్క తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సినిమా విషయాలను పంచుకుంటూ ఈ చిత్రంలో తన పేరు రోజీ నరోన్హా అని పేర్కొని ‘మెనీ మూడ్స్ ఆఫ్ రోజీ’ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక వీటిపై క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించారు. ఇక యువరాజ్, అనుష్క చిత్రాలకు లైక్ లు కొట్టడమే కాకుండా ‘ఓయే హోయే రోజీ భాభీ.. లుకింగ్ ఆసమ్’ అంటూ టైం లైన్ లో పోస్ట్ చేశాడు. ఇక కొహ్లీకి ప్రేయసి అంటే మిగిలిన జట్టుకు అనుష్క భాభీనేగా…మరి మరిదిగారి పోస్ట్ ను వదినగారు చూసారో లేదో…!