రాహుల్ తేవటియా నీకు ధన్యవాదాలు – యువరాజ్ సింగ్

Monday, September 28th, 2020, 03:52:57 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపియల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్ మన్ హిట్టింగ్ చేశారు. అయితే ఈ మ్యాచ్ తో ఒక్కసారిగా చాలా ఫేమస్ అయ్యాడు రాహుల్ తేవాటియా. ఒకే ఓవర్ లో వరుస గా 5 సిక్స్ లు కొట్టిన ఈ రాజస్థాన్ రాయల్స్ హీరో పై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మిస్టర్ రాహుల్ తేవటియా వద్దు భాయ్ వద్దు, ఆ ఒక్క బంతి వదిలేసినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అద్భుతమైన ఈ మ్యాచ్ లో విజయం సాధించినందుకు గానూ రాజస్థాన్ రాయల్స్ కి కంగ్రాట్స్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ లో మొదటగా తేవటియా పరుగులు తీసేందుకు కాస్త కష్టపడ్డాడు. అయితే శాంసన్ ఔట్ అయిన నెక్స్ట్ ఓవర్ కి తన ప్రతాపాన్ని చూపించారు. అయితే గతంలో యువరాజ్ సింగ్ వరుస సిక్స్ లతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. తేవటియా 31 బంతుల్లో 53 పరుగులు చేయగా అందులో 7 సిక్స్ లు ఉండటం విశేషం.