బ్రేకింగ్: వైసీపీ సీనియర్ నేత సాంబశివరావు కన్నుమూత..!

Monday, August 10th, 2020, 10:00:36 AM IST

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.

ఇదిలా ఉంటే గతంలో సాంబశివరాజు రెండు సార్లు మంత్రిగా, ఎనిమిది సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. విజయనగరం రాజకీయాలలో ఆయన కీలక పాత్ర పోశించారు. ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న బొత్స వంటి హేమాహేమీలకు కూడా ఆయన రాజకీయ గురువుగా ఉన్నారు. అలాంటి సీనియర్ నేత సాంబశివరావు మరణం పలువురు నేతలను దిగ్బ్రాంతికి గురిచేసింది.