స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఒప్పుకునే ప్రసక్తే లేదు – విజయసాయి రెడ్డి

Saturday, February 20th, 2021, 03:42:45 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డు నేడు 25 కిమీల పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ అనేక త్యాగాల ఫలితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. సీఎం జగన్‌ మాట ఇస్తే తప్పరని ఆయన ఆదేశాల మేరకే పాదయాత్ర చేపట్టామని చెప్పుకొచ్చారు.

అయితే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం శక్తివంచన లేకుండా స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాటం చేస్తామని, ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించే రాజకీయ నాయకులు ఈ పోరాటంలో కలిసి రావాలని సూచించారు.