ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం.. టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్సీ సవాల్..!

Tuesday, March 16th, 2021, 03:00:16 AM IST

టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ మున్సిపల్ పోరులో ఇంతకుముందెన్నడూ ఎవరూ గెలవనన్ని స్ధానాలు వైసీపీకి దక్కాయని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం వలనే ప్రజలు కూడా వైసీపీకే పట్టం కట్టారని అన్నారు. చంద్రబాబు – ఔరంగజేబు ఒకే కోవకు చెందిన వ్యక్తులు అని అన్నారు.

అయితే చంద్రబాబు, లోకేష్ ఇన్ సైడ్ ట్రేడింగ్ ను గమనించారు కాబట్టే అమరావతి ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారని అన్నారు. సంక్షేమ పథకాల్లో అక్రమాలున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని వారందరికి చెబుతున్నా నేడు ఎక్కడైనా చర్చకు సిద్దమని ఇదే నా సవాల్ అని అన్నారు. అచ్చెన్నాయుడు విశాఖ ఉక్కు మీద ఎనలేని ప్రేమ గుప్పిస్తున్నాడని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై అంత ప్రేమ ఉంటే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని నిజంగా రాజీనామా చేయమనాలని అన్నారు.