మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా.. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసుపత్రికి..!

Monday, September 7th, 2020, 07:28:56 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా కరోనా సోకింది.

అయితే రెండు రోజుల క్రితమే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా ఆయనను తాజాగ ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు తరలించారు. బెంగళూరులో ఎమ్మెల్యే దొరబాబు సమీప బంధువుల ఆస్పత్రి ఉండటంతో ఆయనను అక్కడికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హెలికాప్టర్‌లో దొరబాబు వెంట ఆయన భార్యతో పాటు మరో ఇద్దరు బంధువులు బెంగళూరుకు వెళ్లారు.