సీఎం కేసీఆర్‌కు హరిత కానుక ఇవ్వండి.. ఎమ్మెల్యే రోజా పిలుపు..!

Monday, February 15th, 2021, 06:38:39 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కోటి వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 17న ఉదయం 10-00 గంటల నుంచి 11-00 గంటల వరకు కేవలం ఒక గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

అయితే తాజాగా ఈ కార్యక్రమంపై స్పందించిన ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు జరుగుతున్న కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని, ఒకేరోజు ఒకే గంటలో కోటి మొక్కలను నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని సీఎం కేసీఅర్ గారికి హరిత కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు.