ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు – ఎమ్మెల్యే రోజా

Wednesday, February 10th, 2021, 03:30:06 PM IST

MLA_Roja

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి సెటైర్లు గుప్పించారు. తొలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు చూశాక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఎస్ఈసీ నిమ్మగడ్డకు దిమ్మ తిరిగి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీని సమాధి చేశారని, ఆ సమాధిలోంచి శవాన్ని తీసి బతికించాలనే ప్రయత్నం ఎస్ఈసీ నిమ్మగడ్డ చేశారని అది జరిగే పనికాదని తాను మొన్ననే చెప్పానని రోజా అన్నారు.

అయితే సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలే భారీగా వైసీపీ మద్ధతుదారులను గెలిపించాయని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీకి పూర్వవైభవం తీసుకురాలేరని రోజా చెప్పుకొచ్చారు. 2018లో పెట్టాల్సిన ఎన్నికలు అప్పుడు పెట్టకుండా కుట్రపూరితంగా ఇప్పుడు పెట్టారని అయినా ప్రజలు టీడీపీకి, ఆ పార్టీ కోవర్టు నిమ్మగడ్డకు సరైన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే రోజా అన్నారు.