చంద్రబాబు తన నిజాయితీనీ నిరూపించుకోవాలి.. ఎమ్మెల్యే రోజా డిమాండ్..!

Wednesday, September 16th, 2020, 04:50:02 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సరికొత్త డిమాండ్ విసిరారు. రాజధని పేరుతో భూ కుంబకోణానికి పాల్పడిన చంద్రబాబు ఆయన బినామీలు జైలుకు వెళ్లడం తప్పదని అన్నారు. రాజధాని పేరుతో బినామీలను దింపి చంద్రబాబు, నారాజ్ లోకేశ్, బాలకృష్ణలు వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు గుప్పించారు.

అంతేకాదు గత టీడీపీ హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, అందుకే జనాలు కూడా వైసీపీనీ భారీ మెజారిటీతో గెలిపించి టీడీపీకి సరైన బుద్ధి చెప్పారని అన్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంటే వాటిని కోర్టుల ద్వారా స్తేల్ తెచ్చి అడ్డుకోవడం దారుణమని అన్నారు. అయితే ఇకనైనా కోర్టుల చుట్టు తిరగకుండా చంద్రబాబు తన నిజాయితీనీ నిరూపించుకోవాలని రోజా కోరారు.