కుప్పం నుంచి చంద్రబాబును పీకేశారు.. ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్..!

Thursday, February 18th, 2021, 01:21:36 AM IST

MLA_Roja
ఏపీలో నేడు జరిగిన మూడో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ సత్తా చాటుతోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా వైసీపీ హవా కొనసాగుతుంది. కుప్పంలో టీడీపీకి జరిగిన భంగపాటుపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును మనువడితో ఆడుకోవాలని ప్రజలు ఇంటికి పంపించేశారని అన్నారు. విశాఖ వెళ్ళి జగన్ ఏం పీకారని చంద్రబాబు మాట్లాడారని, కానీ కుప్పం నుంచి ఆయనను ప్రజలు పీకేశారని ఇకనైనా చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని రోజా అన్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో 89 పంచాయతీలకు నేడు ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటివరకు అందిన ఫలితాల్లో 72కి పైగా పంచాయితీల్లో వైసీపీ మద్ధతుదారులు గెలవగా, 13 చోట్ల టీడీపీ మద్దతు దారులు గెలుపొందారు. మరో 4 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.