నన్ను పట్టించుకోవడం లేదు.. కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే రోజా..!

Monday, January 18th, 2021, 03:19:24 PM IST

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా కన్నీరు పెట్టుకున్నారు. తిరుపతిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా అందరి ముందే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల ప్రోటోకాల్‌పై ప్రధానంగా చర్చ జరగ్గా రోజా తన ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అసలు అధికారులు తన మాట వినడం లేదని, తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రొటోకాల్ విషయంలో కూడా అధికారులు తనను నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్నీ ఆమె కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అయితే అధికారులు తనకు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని, తనకు తెలియకుండానే అధికారులు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని, వారిలో కలెక్టర్ స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఉన్నారని రోజా కమిటీకి ఫిర్యాదు చేసింది.