నగరిలో రైతుల నుంచి ఎమ్మెల్యే రోజాకు ఎదురుదెబ్బ..!

Monday, August 24th, 2020, 08:28:03 AM IST

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 250 రోజులుగా నిరవధిక పోరాటం చేస్తున్న రాజధాని గ్రామాల రైతులకు మద్ధతుగా నగరి ప్రాంత రైతులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రైతు నాయకులు బ్రిటీష్ ప్రభుత్వం కంటే దారుణంగా జగన్ పాలన సాగుతుందని, 250 రోజులుగా అమరావతి రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని నగరి రైతులు డిమాండ్ చేశారు. అయితే సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ముందు నుంచి సమర్ధిస్తూ వస్తున్న రోజాకు ఈ విషయంపై తన నియోజకవర్గంలోని రైతుల నుంచి వ్యతిరేకత రావడం ఇప్పడు హాట్ టాఫిక్‌గా మారింది.