సీఎం జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారు.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Monday, April 12th, 2021, 08:58:43 PM IST

ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేడు పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే పార్థసారధి ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే దేశంలోని ప్రజలంతా జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారంటూ మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. అయితే ఆ సమయంలో వేదికపైనే ఉన్న సీఎం జగన్ ప్రతిస్పందనగా చిరునవ్వులు చిందించారు.

ఇదిలా ఉంటే మంత్రి పేర్ని నాని చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 50 వేలకు పైగా వాలంటీర్లను చూసి చంద్రబాబు మరియు విపక్ష నేతలు కుళ్లుకుంటున్నారని అన్నారు. జగన్‌కు సైన్యంలా పనిచేస్తున్న వాలంటీర్ల దెబ్బకు సర్వర్లు హ్యాంగ్ అయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు.