420 బాబు పుట్టిన తేదీలోనే ఉంది!

Friday, January 30th, 2015, 05:23:44 PM IST


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం తణుకులో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 420 కేసు పెట్టాలని మండిపడ్డారు. అలాగే చంద్రబాబు పుట్టున రోజు ఏప్రిల్ 20 కావడంతో అతని జన్మతేదీలోనే 420 ఉందని చెవిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి తణుకులో ప్రారంభించనున్న రైతు దీక్షతో బాబు పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. అలాగే మరో వైకాపా నేత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ జగన్ చేపడుతున్న రైతు దీక్షతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచించారు. ఇక జగన్ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుండి భారీగా ప్రజలు పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.