వైసీపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం.. లారీనీ ఢీకొట్టిన కారు..!

Tuesday, October 13th, 2020, 08:30:28 AM IST

నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే వరప్రసాద్ తన కారులో చెన్నై నుంచి గూడురు వెళ్తుండగా నాయుడుపేట సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.

అయితే ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శ్రీహరికి తీవ్ర గాయాలు కాగా, ఎమ్మెల్యే వరప్రసాద్‌కు స్వల్ఫ గాయాలు అయ్యాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేను వెంటనే అక్కడి నుంచి వేరే వాహనం ఇంటికి పంపించేశారు.