బిగ్ న్యూస్: వైసీపీ ఎమ్మెల్యేకి రెండోసారి కరోనా పాజిటివ్..!

Thursday, October 8th, 2020, 11:38:26 AM IST

ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలను కరోనా విడిచిపెట్టడంలేదు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఇటీవల ద్రోణంరాజు శ్రీనివాస్‌లు ఏకంగా కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే ఒకసారి కరోనా వచ్చిన తర్వాత మళ్లీ రాదన్న అపోహాలు చాలా మందిలో ఉన్నాయి.

అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత సరైన జాగ్రతలు తీసుకోకుంటే మళ్ళీ వైరస్ బారిన పడే ప్రమాదముంది. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి రెండో సారి కరోనా బారిన పడ్డారు. అయితే ఆగస్టులో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి కరోనా సోకడంతో రుయా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని నెగిటివ్ వచ్చాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా నెలన్నర రోజుల తర్వాత నిన్న తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఎమ్మెల్యే కరోనా పరీక్షలు చేయించుకోగా మళ్ళీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే నేడు మరోసారి పరీక్షలు చేయించుకుని ఆ ఫలితం ఆధారంగా ఎమ్మెల్యే చికిత్స తీసుకోనున్నారు.