వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కరోనా పాజిటివ్..!

Thursday, September 10th, 2020, 09:30:56 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరోనా బారిన పడ్డారు.

అయితే తనకు కాస్త అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని దీంతో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యిందని అన్నారు. అయితే ఈ మధ్య తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే వారం క్రితం ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి కన్నుమూయడంతో ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.