చంద్రబాబు, లోకేశ్‌లకు వైసీపీ మంత్రి సరికొత్త డిమాండ్..!

Tuesday, September 15th, 2020, 02:14:13 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సరికొత్త డిమాండ్ విసిరారు. అమరావతి భూముల్లో స్కామ్ జరిగిందనే అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం కోరడంపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ రాజధాని భూముల విషయంలో అవినీతి జరిగితే విచారణ జరిపించాలని నారా లోకేశ్ పలుసార్లు కోరారని అయితే ఏది బలంగా కోరుకోవద్దని లోకేశ్‌కి ఎప్పటి నుంచో చెబుతున్నామని అన్నారు.

అయితే రాజధాని భూముల విషయంలో టీడీపీ నేతలే సీబీఐ విచారణ జరిపించాలని కోరారని, టీడీపీ ప్రభుత్వమే అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కి పాల్పడిందని అన్నారు. రాజధాని గ్రామాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముందుగాన లీకులు ఇచ్చి భూములు కొనుగోలు చేయించుకున్నారని అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ,దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసును సీబీఐకి అప్పచెప్పామని మంత్రి అనిల్ అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకు చిత్త శుద్ధి ఉంటే రాజధాని భూముల విషయంలో సీబీఐ చేపట్టే విచారణకు సహకరిస్తామని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.