ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన పెనుమత్స సురేష్, జకీయా..!

Tuesday, October 6th, 2020, 06:53:06 PM IST

ఏపీ అధికార పార్టీ వైసీపీ తరుపున ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ వీరిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే గతంలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపడంతో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. దీంతో సీఎం జగన్ పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ అవకాశం ఇచ్చారు.

అయితే వీరిద్దరి ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్‌ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, శాసనసభ చీఫ్‌ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో ముందు నుంచి పార్టీనీ నడిపించిన పెనుమత్స సాంబశివరాజు కుటుంబానికి తగిన న్యాయం జరిగిందని అన్నారు. మైనారిటీ మహిళకూ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం గొప్ప పరిణామమని అంజద్ భాషా పేర్కొన్నారు. నమ్ముకున్నవ్వారికి వైఎస్ కుటుంబం తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు.