నంద్యాలలో దారుణం.. వైసీపీ నేతను హత్య చేసిన దుండగులు..!

Friday, October 9th, 2020, 11:15:42 AM IST

ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నేతను దారుణంగా హత్యచేశారు. వైసీపీ నేత సుబ్బారాయుడు నేడు ఉదయం వాకింగ్‌కు వెళ్ళగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. విజయ పాల డెయిరీ సమీపంలో కర్రలతో తీవ్రంగా కొట్టి దారుణంగా హత్య చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే సుబ్బారాయుడు పొన్నాపురం రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. ఆయన న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే పాత కక్షల కారణంతోనే ఆయనను హత్య చేశారా? లేదంటే ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుబ్బారాయుడు హత్యను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.