నన్ను క్షమాపణ కోరాల.. సీఐకి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత..!

Monday, September 21st, 2020, 08:30:11 AM IST

ఏపీలో ఓ సీఐకి వైసీపీ నేత గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌రెడ్డి అటుగా వెళ్తున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లా వాహనాన్ని ఆపారు. అతనితో పాటు 20 మంది ఉండటంతో ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని సీఐ ప్రశ్నించాడు.

దీంతో ఆగ్రహించిన వైసీపీ నేత హబీబుల్లా నువ్వు యూనిఫాం అయినా వదలాల, లేకపోతే నేను రాజకీయమన్నా వదలాల ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరితో మాట్లాడుతున్నావు ముందు తెలుసుకో అని అన్నాడు. నన్ను క్షమాపణ కోరాల లేదంటే నేనేంటో చూపిస్తా నీకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.