జెండా కూడా కట్టలేవు.. బీజేపీ నేతకు వైసీపీ నేత వార్నింగ్..!

Tuesday, September 15th, 2020, 10:15:22 AM IST

ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేత బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చాడు. కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గం బీజేపీ ఇన్‌ఛార్జ్ పురుషోత్తం రెడ్డిపై వైసీపీ నేత మాజీ సర్పంచ్ అవతారం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని తీరు మార్చుకోకపోతే అంతుచూస్తామని హెచ్చరించారు.

అంతేకాదు మేము తలుచుకుంటే కౌతాలం మండలంలో ఒక్క బీజేపీ జెండా కూడా కట్టలేరని అన్నారు. తప్పుడు మాటాలు మాట్లాడితే ఇక్కడ అడుగు కూడా పెట్టనివ్వబోమని అన్నారు. అయితే పురుషోత్తం రెడ్డి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతామని, దీనిపై ఆయన చర్చకు సిద్దమేనా అని సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన గురుంచి ఏపీలో మాట్లాడేందుకు బీజేపీ నేతలకు అర్హత లేదని ఎద్దేవా చేశారు.