బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వైసీపీ నేత సవాల్.. నిరూపిస్తావా!

Saturday, December 26th, 2020, 03:00:04 AM IST

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ వైసీపీ నేత, ఏపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు రజాక్‌పై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రజాక్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తనను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాడ్డుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుడు ఆరొపణలు చేస్తున్నారని అలా అని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తాను చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.

అంతేకాదు ఆ మల్లిఖార్జున స్వామిని ఏ మతం వారైనా పూజించవని, దేవుడిని పూజించకూడదని మీ మత గ్రంధంలో అయినా రాసిందా లేక రాజ్యాంగంలో ఏమైనా రాశారా అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రజాక్ ప్రశ్నించారు. శ్రీశైలం దేవస్థానంలో తన పేరుమీద పైసా పని కూడా చేయలేదని, తన ముస్లిం సోదరులకు కూడా దేవస్థానంలో ఎలాంటి కాంట్రాక్టులు ఇప్పించలేదని అన్నారు. అసలు ఆరోపణలు చేసే ముందు నిజనిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని రజాక్ అన్నారు.