చంద్రబాబు ఒప్పుకుంటే మళ్ళీ టీడీపీలో చేరుతానంటున్న వైసీపీ నేత..!

Monday, January 18th, 2021, 07:23:54 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే తాను మళ్ళీ టీడీపీలో చేరుతానని వైసీపీ నేత పాలపర్తి డేవిడ్ రాజు అన్నారు. చంద్రబాబు నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని, తన వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని వాటిని సరిదిద్దుకునేందుకే తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యాయని డేవిడ్ రాజు చెప్పుకొచ్చారు. అయితే తనతో పాటు తన కుమారుడు కూడా టీడీపీలో చేరతారని అన్నారు.

అయితే 2009 అసెంబ్లీ ఎన్నికలలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన డేవిడ్ రాజు కాంగ్రెస్ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ చేతిలో ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికలకు ముందు వైసీపీ చేరిన డేవిడ్ రాజు ఆ ఎన్నికలలో విజయం సాధించారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన మళ్ళీ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు ఆయన తిరిగి వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యాడు.