టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్..!

Sunday, January 3rd, 2021, 03:00:05 AM IST

ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామతీర్ధం ఆలయానికి చైర్మన్‌గా ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతి రాజుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రామతీర్థం సహా మరో మూడు ఆలయాల చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే రామతీర్థం, పైడి పల్లి అమ్మవారి దేవస్థానం, మందపల్లి ఆలయాల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆలయ చైర్మన్‌గా ఉంటూ కూడా ఆలయాలను సంరక్షించలేకపోయారంటూ అందుకే ఆయనను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్టు దేవాదాయ శాఖ చెప్పుకొచ్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన జీవో 65ను ఉపసంహరిస్తూ మెమో జారీ చేసింది.