ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..!

Friday, October 16th, 2020, 11:13:29 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఢిల్లీలో కీలకమైన పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్టేషన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణంరాజును తప్పించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే రఘురామకృష్ణంరాజు స్థానంలో ఆ పదవిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కేటాయించారు.

అయితే అక్టోబర్ 9 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.