సీనియర్ నేత పేరు చెప్పి ల్యాండ్ సెటిల్‌మెంట్స్.. వైసీపీ నేత సస్పెండ్..!

Wednesday, August 12th, 2020, 09:14:24 PM IST


ఏపీ అధికార పార్టీ వైసీపీ ఓ కీలక నేతను సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న కారణంగా ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంది. విశాఖపట్టణానికి చెందిన వైసీపీ నేత కొయ్యా ప్రసాద్‌ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

అయితే విశాఖ కలెక్టరేట్ పేరును, రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పేరును ఉపయోగించి ల్యాండ్ సెటిల్మెంట్స్ పేరుతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని పార్టీ దృష్టికి రావడంతో ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్రం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తక్షణం ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. పార్టీ క్రమశిక్షణా నియమావళికి ఎవరు ఆటంకం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది.