ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

Monday, September 14th, 2020, 08:40:30 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్య జనంతో పాటు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే అధికార పార్టీ వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడగా తాజాగా మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది.

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే గత వారం రోజుల నుంచి తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరుతున్నారు.