సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల!

Monday, May 3rd, 2021, 08:30:46 AM IST

తెలంగాణ రాష్ట్రం లో జరిగిన నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోలింగ్ లో తెరాస అభ్యర్ధి ఘన విజయం సాధించారు. అయితే ఈ నేపథ్యం లో తెరాస పాలనా విధానం పై ఆ పార్టీ కి చెందిన నేతలు సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అదే తరహాలో వైఎస్ షర్మిల సీఎం జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఉధృతంగా ఉన్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ ను లెక్క చేయకుండా నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ కు శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ ఆనంద సమయం లో నైనా కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కోరుతున్నాం అంటూ వైఎస్ షర్మిల తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఒక పక్క వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి, మరోక పక్క పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యం లో కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి అంటూ విపక్షాలు మొదటి నుండి అధికార పార్టీ ను డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.