కొత్త పార్టీపై స్పీడ్ పెంచుతున్న వైఎస్ షర్మిల.. కీలక నేతలతో భేటీ..!

Monday, February 15th, 2021, 05:33:38 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీపై స్పీడ్ పెంచింది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమైన షర్మిల తాజాగా నేడు మరికొందరు కీలక నేతలతో భేటీ అయ్యింది. ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు రామచంద్రమూర్తి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాఘం రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగా షర్మిల పెట్టబోయే పార్టీని తాను ఆహ్వానిస్తున్నానని, ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరి సొత్తు కాదని, ఎవరైనా పార్టీలు పెట్టొచ్చని అన్నారు. షర్మిల పార్టీ పెట్టాక పార్టీకి నా అవసరం ఉందని అనుకుంటే పార్టీకి సేవలు అనిదించడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ నెల 20న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.