మీ పాలనలో ఒక్కటన్న సక్కగుందా.. కేసీఆర్‌కు వైఎస్ షర్మిల చురకలు..!

Wednesday, May 12th, 2021, 10:00:07 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల గత కొద్దిరోజులుగా ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అయితే తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌కు షర్మిల చురకలు అంటించారు. వైఎస్సార్ హయాంలో ఆపద ఉందని ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు 20 నిమిషాల్లో వచ్చే 108 అంబులెన్సులు ఎక్కడ పోయాయి సీఎం సారు అని ప్రశ్నించారు. కరోనా డెడ్ బాడీలను తరలించేందుకు రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తున్నారు, కరోనా పేషంట్ల నుంచి ప్రైవేట్ అంబులెన్సులు అడ్డగోలుగా దోచుకొంటుంది మీకు కనిపించడం లేదా అంటూ నిలదీశారు.

అంతేకాదు మీ పాలనలో ఒక్కటన్న సక్కగుందా అంటూ
పేషేంట్ల కోసం అంబులెన్సులు లేవు, టెస్టులు చేసే కిట్లు లేవు, పట్టించుకొనే డాక్టర్లు లేరు, ఊపిరి నిలిపే ఆక్సిజన్ లేదు, వాక్సిన్ లేదు, నువ్వు ఏం చేయాలో నీకు కోర్టులు చెప్పాలే, నీకు పరిపాలన అంత చేతకానప్పుడు.. కోర్టులకో లేక గవర్నర్‌కో నీ పాలనను అప్పగించు దొర అని ఎద్దేవా చేశారు.