కేసీఆర్ సార్ ఇప్పటికైనా సోయిలోకిరా.. వైఎస్ షర్మిల కామెంట్స్..!

Wednesday, May 12th, 2021, 01:38:46 AM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల గత కొద్దిరోజులుగా ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అయితే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కొద్ది రోజుల నుంచి డిమాండ్ వినిపిస్తున్న షర్మిల అయ్య పెట్టడు అడుక్కుతిననియ్యడు అంటూ కేసీఆర్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. కేంద్ర ఆయుష్మాన్ భారత్‌లో చేరరు. దొర నిర్ణయాలన్నీ కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెడుతున్నవని, కోవిడ్ ఆసుపత్రుల్లో వసతులు ఉండవు సర్కార్ దవాఖానా ఉన్నావా అంటే ఆ ఉన్నా అన్నట్లే ఉందని అన్నారు.

అయితే హైదరాబాద్ నాలుగు దిక్కులా దవాఖానాలు కడుతానన్న దానికి మోక్షం లేదు. ప్రజల ఆరోగ్యానికి సరిపోను బడ్జెట్ ఇచ్చేదిలేదు. ఉస్మానియా.. గాంధీ, నిమ్స్.. టీమ్స్ లకే ఊపిరి సక్కగా అందుతలేదు, ఇక అందులో చేరినవారి ఊపిరి గాలిలో దీపం అని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి రేటు ఎక్కువ, జనం కరోనా నుండి బతికి బయటపడితే అప్పులతో చచ్చేటట్టుంది. కేసీఆర్ సారు సోయిలకురా ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చు అని షర్మిల డిమాండ్ చేశారు.