మీ కళ్ళకున్న గులాబీ గంతలు తీసేయండి కేసీఆర్ దొరగారు – వైఎస్ షర్మిల

Thursday, May 6th, 2021, 10:31:30 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల గత కొద్దిరోజులుగా ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దానిపై కూడా ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంకెంతమంది ఆక్సిజన్ అందక చనిపోతే కరోనా కంట్రోల్ తప్పిందనుకొంటారని, ఇంకెంతమంది బెడ్లు సరిపోక రోడ్డున పడితే కరోనా విలయతాండవం చేస్తుందనుకొంటారని అన్నారు.

అంతేకాదు ఇంకెంత మంది వాక్సిన్ అందక కరోనా బారిన పడితే కరోనా ఉందని గుర్తిస్తారని, ఇంకెంత మంది కరోనాతో అప్పులబారిన పడితే రాష్ట్రంలో కరోనా అదుపు తప్పిందని భావిస్తారని ప్రశ్నించారు. అంత కంట్రోల్లో ఉందని జబ్బలు చర్చుకోవడం మాని మీ కళ్ళకున్న గులాబీ గంతలు తీసేసి, కరోనాను కట్టడి చేయండి, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి కేసీఆర్ దొరగారు అని వైఎస్ షర్మిల అన్నారు.