ఆపదలో తోడుగా ఉండేందుకు YSSR టీం ఏర్పాటు చేస్తున్నా – వైఎస్ షర్మిల

Saturday, May 15th, 2021, 12:53:11 AM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న షర్మిల తాజాగా తెలంగాణ ఆడపడుచులకు సాయపడేందుకు సరికొత్త కార్యక్రమం చేపట్టింది. కరోనా ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందని, కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే ఎంతో మంది ఈ కరోనా బారిన పడి చనిపోయారని అన్నారు. అయితే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి ఒకవైపు.. కుటుంబాన్ని నెట్టలేక మరోవైపు ఎంతో మంది మహిళలు నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్నారని షర్మిల అన్నారు.

అయితే మీ కుటుంబాన్ని నడిపించే తండ్రైనా, భర్త అయిన, కొడుకైన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వారు ఎవరైనా కరోనా బారిన పడి చనిపోతే ఆ కుటుంబాల బాధేంటో నాకు తెలుసని షర్మిల అన్నారు. అయితే మీరు ధైర్యం కోల్పోకుండా ఉండండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, మళ్ళీ మీ జీవితం సాఫీగా సాగేందుకు మీరంతా మన వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా భావించి నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నారని, ఎవరైనా మహిళలు ఇబ్బందులు పడుతూ ఉంటే “ఆపదలో తోడుగా YSSR” ఫోన్ నెంబర్ 040-48213268కి సమాచారాన్ని తెలియచేయాలని సూచించారు.