నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు.. షర్మిల కీలక వ్యాఖ్యలు..!

Wednesday, March 17th, 2021, 01:57:54 AM IST


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీనీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన షర్మిల కొత్త పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.

అయితే ఏప్రిల్‌ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని, లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. అయితే తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీనీ ఏర్పాటు చేస్తున్నట్టు షర్మిల చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పార్టీ ఏర్పాటు అనంతరం వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీ చేయాల్సిన స్థానంపై కూడా వైఎస్ఆర్ అభిమానులు ఆమెకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలొని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని షర్మిలకు సూచించినట్టు సమాచారం.