వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం.. నేతల్లో మరింత జోష్ నింపిన వైఎస్ షర్మిల..!

Thursday, March 25th, 2021, 05:24:30 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల దీనికి సంబంధించి మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు జిల్లాల అనుచరులతో వరుసగా భేటీ అవుతున్న షర్మిల ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే తాజాగా నేడు పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో సమావేశమైన షర్మిల సంకల్ప సభ వాల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేతల్లో మరింత జోష్ నింపింది.

అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని, మనం టీఆర్ఎస్ చెబితేనో, బీజేపీ అడిగితేనో వచ్చినవాళ్లం కాదని అన్నారు. అయితే వైఎస్ఆర్ పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్ 9న మనం తొలి అడుగు వేద్దామని తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని దేవుడు ఉన్నాడని, ప్రజల ఆశీర్వాదం కూడా మనకు ఉండాలని షర్మిల అన్నారు.